![]() |
![]() |
సుమ ఏ షో చేసినా ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ప్రస్తుతం సుమ అడ్డా పేరుతో చేస్తున్న షో కూడా అందర్నీ బాగా ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్రతివారం లాగే ఈ వారం కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ షోను ఆద్యంతం ఎంతో సందడిగా చేసింది సుమ. నటీమణులు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ, వై.విజయ, జయలక్ష్మీ ఈ షోకు గెస్టులుగా అటెండ్ అయ్యారు. వారికి చెరుకు గడలు ఇచ్చి తినమని టాస్క్ ఇచ్చింది. దాంతో ఆ నలుగురు చెరుకు గడలు కొరుకుతూ పళ్ళకు పని చెప్పారు.
ఈ టాస్క్ పూర్తయిన తర్వాత వారితో ఓ హోటల్ ఓపెన్ చేయించింది. అన్నపూర్ణ, వై.విజయ ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో నటించారు. ఎఫ్3లో వాళ్లు హోటల్ రన్ చేస్తారు. కాబట్టి సరదాగా వారితో ఈ గేమ్‌ను ఆడిరచింది సుమ. ఖుష్బు బోండా, రమ్యకృష్ణ వడ, రామ్‌చరణ్ ఇడ్లీ, జూనియర్ ఎన్టీఆర్ బోండాం, మహేష్‌బాబు దోశ అంటూ వారు చేసిన టిఫిన్స్‌కి పేర్లు పెట్టి అమ్మేసారు. అప్పుడు సుమకు ఒక డౌట్ వచ్చింది ‘మహేష్‌బాబు దోశ మనమే తినేస్తే ఆయనేం తింటారు’ అని. ఈ మాట అనే సరికి వై.విజయ షాక్ అయిపోయింది. తర్వాత కస్టమర్స్‌ని ఆహ్వానించి వారికి ముద్దులు పెట్టి దగ్గరుండి వారికి టిఫిన్స్ కూడా తినిపించి బాగా అట్రాక్ట్ చేసుకుంది. ఆ విధంగా ఫ్రెండ్లీ హోటల్ మాది అనిపించుకుంది. ఇది చూసిన శ్రీలక్ష్మీ అది ఫ్రెండ్లీ హోటల్ కాదు, అక్కడ తింటే ఫుడ్ పాయిజన్ అయిపోతుంది అని సీరియస్‌గా అంది. అలా ఈ టాస్క్‌ని సరదాగా చేశారు.
![]() |
![]() |